బంజారాహిల్స్‌లో భూమి కబ్జా.. అధికారుల స్వాధీనం

బంజారాహిల్స్‌లో భూమి కబ్జా.. అధికారుల స్వాధీనం

TG: హైదరాబాద్‌‌లోని బంజారాహిల్స్‌లో కబ్జాకు గురైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మీ ఆ భూమిని పరిశీలించారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలను మంత్రి అభినందించారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు చెప్పాలని సూచించారు.