'బస్సు ప్రమాదం మనసును కలిచివేసింది'

'బస్సు ప్రమాదం మనసును కలిచివేసింది'

మార్కాపురం జిల్లా ఇవాళ జరిగిన బస్సు ప్రమాదంపై జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందడం మనసును కలిచివేసిందన్నారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ఒక ప్రకటన విడుదల చేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సదరు ప్రకటనలో పేర్కొన్నారు.