VIDEO: రైతన్న కష్టానికి చేదోడుగా నిలిచిన బుడ్డోడు

VIDEO: రైతన్న కష్టానికి చేదోడుగా నిలిచిన బుడ్డోడు

JGL: చిన్నపిల్లలు ఫోన్లతో కాలక్షేపం చేస్తున్న నేటి యుగంలో ఓ నాలుగేళ్ల బుడ్డోడు రైతన్న పడుతున్న కష్టానికి చేదోడుగా నిలిచాడు. వ్యవసాయ పనుల్లో కష్టపడుతున్న తన తాతకు సహాయం చేస్తూ శభాష్ అనిపించుకున్నాడు. మల్యాలకు చెందిన రైతు ఆరే నర్సయ్య తన వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేసే క్రమంలో మనవడు నవతేజ సైతం పొలంలో దిగి వరి నారు అందించి శభాష్ అనిపించుకున్నాడు.