మెడికల్ కాలేజీల కోసం అనూహ్య స్పందన: వెంకటరామిరెడ్డి

మెడికల్ కాలేజీల కోసం అనూహ్య స్పందన: వెంకటరామిరెడ్డి

ATP: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన 'కోటి సంతకాల ప్రజా ఉద్యమం'కు అపూర్వ స్పందన వచ్చింది. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 84,339 సంతకాలు సేకరించామని జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సంతకాల ప్రతులను బైక్ ర్యాలీగా జిల్లా కార్యాలయంకు తరలించారు.