కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె. అనిల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన గొప్ప పోరాట యోధుడని, నిజాం పాలనపై తిరుగుబాటు చేసి గుణపాఠం చెప్పారని, ఆయన ఆశయాలు భావితరాలకు స్పూర్తిదాయకం అని వారు పేర్కొన్నారు.