కుటుంబ కలహాలతో యువకుడు SUICIDE
MDK: తొగుట మండలం బండారుపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. K. సాయికుమార్ (20) కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం భార్య చంద్రకళతో వాగ్వాదం జరగగా, సాయంత్రం డెయిరీ ఫార్మ్‌కు వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన సాయికుమార్ రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా గ్రామ శివారులోని తన వ్యవసాయ పొలంలో వేప చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందినట్లు గుర్తించారు.