పోరండ్లలో ముగిసిన ప్రచారం.. 14న పోలింగ్

పోరండ్లలో ముగిసిన ప్రచారం.. 14న పోలింగ్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామంలో శుక్రవారం సాయంత్రం పంచాయతీ ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. సర్పంచ్ పదవికి 10 మంది పోటీ పడుతుండగా, 3వ వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన వార్డుల్లో హోరాహోరీగా పోరు నెలకొంది. ఎవరు గెలుస్తారనేది 14వ తేదీన జరిగే పోలింగ్ అనంతరం తేలనుంది. అందరూ తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.