న్యాయం కోసం ఎమ్మెల్యేను ఆశ్రయించిన వ్యాపారులు
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రహదారి పక్కన చిన్న బడ్డీలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాలని మున్సిపల్ అధికారులు వారికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు ఆందోళనలకు గురై ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను ఆయన క్యాంపు కార్యాలయంలో ఇవాళ కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.