వినాయకుడికి 1 కిలో వెండి కిరీటం విరాళం

వినాయకుడికి 1 కిలో వెండి కిరీటం విరాళం

CTR: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారికి సుమారు 1 కిలో , రూ.2.50 లక్షల విలువ గల వెండి కిరీటం విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన దాత శ్రీ సింగిరెడ్డి ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి ఈ విరాళం సమర్పించారు. దాత కుటుంబానికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.