విశాఖ జోన్-4లో ఆక్రమణలు తొలగింపు

విశాఖ జోన్-4లో ఆక్రమణలు తొలగింపు

VSP: విశాఖ జోన్-4లోని సూర్య భాగ్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి జోనల్ కమిషనర్, ఏసీపీ పర్యవేక్షణలో టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్లను ఆక్రమించిన దుకాణాలను తొలగించి, వాహనాల రాకపోకలకు మార్గం సులభం చేశారు. అక్రమ నిర్మాణాలపై కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.