'కుల గణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు చేర్చాలి'

'కుల గణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు చేర్చాలి'

MNCL: కుల గణన జాబితాలో గంగపుత్ర సంఘం పేరు లేకపోవడంపై బెల్లంపల్లి పట్టణ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ మనోజ్‌కు వినతిపత్రం అందజేశారు. బీసీ- ఏ జాబితాలో మొదటి వరుసలో ఉన్న తమ కులాన్ని గణనలో విస్మరించడం దారుణమని సంఘం అధ్యక్షుడు వంగల చక్రపాణి పేర్కొన్నారు. తక్షణమే పొరపాట్లను సరిదిద్ది గంగపుత్రులకు గుర్తింపు కల్పించాలని వారు కోరారు.