మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి సవిత

మృతదేహానికి నివాళులర్పించిన మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ మండలం కొండంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వడ్డీ శ్రీరాములు అత్త వెంకటలక్ష్మమ్మ ఆకస్మికంగా మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సవిత వారి గ్రామానికి వెళ్లి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.