VIDEO: మోడల్ స్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: మోడల్ స్కూల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి మోడల్ స్కూల్‌ను ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, తాగునీటి వసతి, ఇతర సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లో అపరిశుభ్రత కనిపించడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.