ప్రపంచాన్ని మురిపిస్తున్న 'కడప రాయి'

ప్రపంచాన్ని మురిపిస్తున్న 'కడప రాయి'

KDP: నిర్మాణ రంగంలో కడప సున్నపురాయి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తోంది. ఇక్కడి గనుల నుంచి లభించే నలుపు, ఆకుపచ్చ రంగు రాళ్లు అత్యంత దృఢమైనవి. అలాగే చల్లదనాన్నిస్తాయి. నాణ్యతలో సాటిలేని ఈ రాయికి విదేశాల్లోనూ విపరీతమైన డిమాండ్ ఉంది. అందమైన ఫ్లోరింగ్ కోసం మన కడప రాయిని ఐరోపా, అమెరికా దేశాలకు కూడా ఎగుమతి చేస్తుండటం విశేషం. మన మట్టి సంపద నేడు గ్లోబల్ మార్కెట్‌లో మెరుస్తోంది.