నరసరావుపేటలో వ్యాపారులకు కమిషనర్ వార్నింగ్
PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో చెత్త నిర్వహణపై నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తామని గురువారం ఉదయం కమిషనర్ జశ్వంత్ రావు హెచ్చరించారు. పల్నాడు రోడ్డులోని తోపుడు బండ్లు, టీ స్టాల్స్ వ్యాపారులకు పరిశుభ్రత, రెండు బుట్టల విధానంపై అవగాహన కల్పించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 1400 జరిమానా విధించారు.