నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు

RR: ఫరూఖ్ నగర్ మండలం వెలిజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ బాబు నాయక్ శంకుస్థాపన చేశారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.