ఒక వైపు వరి కుప్పలు.. మరో వైపు మట్టి పెళ్లలు

ఒక వైపు వరి కుప్పలు.. మరో వైపు మట్టి పెళ్లలు

KMR: బాన్సువాడ మండలంలో వరి కోతలు కొనసాగుతున్నాయి. దీంతో రైతులు ప్రధాన రహదారుల వెంట ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. మండలంలో కొల్లూరు ప్రధాన రహదారిపై రైతులు ఒకవైపు ధాన్యం ఆరబెట్టారు. మరొకవైపు మట్టి పెళ్లలతో నిండి పోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పలు గ్రామాల ప్రధాన రహదారులు ఇదే దుస్థితిలో ఉన్నాయి. సమస్యను పరిష్కరించాలన్నారు.