విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

SRPT: మోతె మండలం పరిధిలోనీ అన్నారిగుడెం లో మంగళవారం రోజున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికీ చెందిన పడిషాల సువార్త ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో సుమారు 5 లక్షల వరకు నష్టం కలిగిందని బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం వెంటనే పడిశాల సువార్తకు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని స్ధానికులు ప్రభుత్వాన్ని కోరారు.