ప్రమాదాల నివారణకు చర్యలు ప్రారంభం
NLG: కట్టంగూర్ హైవేపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా 'విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ' ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈదులూరు మలుపుల వద్ద అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహనాలు, వెలగని వీధి దీపాలు, రాంగ్ రూట్ ప్రయాణాల వల్ల నిత్యం ప్రాణనష్టం జరుగుతోందని కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నల్గొండ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు.