అక్రమ కేబుల్ వైర్ల తొలగింపు

HYD: అనుమతి లేకుండా విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన ప్రైవేటు సంస్థల కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు సోమవారం తొలగించారు. ఇటీవల రామంతపూర్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో, మేడ్చల్ పట్టణంలోని వీధులు, కాలనీలలోని విద్యుత్ స్తంభాలకు కుప్పలు తెప్పలుగా ఏర్పాటు చేసిన అనధికారిక కేబుల్ వైర్లను అధికారులు తొలగించారు.