VIDEO: జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు

VIDEO: జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు

కృష్ణా: జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాలు, పైఎత్తు నుంచి వచ్చిన వరదలతో బుడమేరు, వన్నేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉయ్యూరు-తేలప్రోలు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఇందుపల్లి-లంకపల్లి మధ్య వన్నేరు వాగు భారీగా పొంగిపొర్లుతోంది. పుట్టగుంట వంతెన వద్ద బుడమేరు వరద అంచులకు తాకుతూ ప్రవహిస్తోంది. మరోవైపు దివిసీమకు వరద కొనసాగుతోంది.