VIDEO: కలగట్లలో గ్రామసభ
ప్రకాశం: కనిగిరి మండలంలోని కలగట్ల స్కూల్ వద్ద గురువారం పంచాయతీ కార్యదర్శి కొండయ్య గ్రామసభ నిర్వహించారు. పోలవరం పంచాయతీ నుంచి మన మూడు గ్రామాలను విడదీసి కొత్తగా ఒక గ్రామ పంచాయతీగా ఏర్పరచుకోవడంపై గ్రామస్తులతో చర్చించి అభిప్రాయాలు స్వీకరించారు. అభిప్రాయాలను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలియజేశారు.