యంత్రాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

యంత్రాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: సిద్దవటం మండలంలోని అర్హత కలిగిన రైతులందరికీ సబ్సిడీపై వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు అందజేస్తామని వ్యవసాయ అధికారి రమేష్ రెడ్డి తెలిపారు. సోమవారం సిద్ధవటంలో ఆయన మాట్లాడుతూ.. ట్రాక్టర్ ఆధారిత పనిముట్లు సస్యరక్షణ పరికరాలు మొదలైనవి వ్యవసాయ యాంత్రీకరణ కింద అవసరమైన రైతులు సంబంధిత రైతుసేవా కేంద్రంలో యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలిపారు.