ఆర్డీవో ఆఫీస్‌లో 4 అర్జీలు
E.G: రాజమహేంద్రవరం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో 4 అర్జీలు వచ్చినట్లు ఏవో ఎం. సుజాత తెలిపారు. అనధికార కట్టడాలు, పింఛన్లు, భూ సమస్యలపై వచ్చిన ఈ వినతులను వెంటనే పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, నూరు శాతం పరిష్కారం దిశగా సిబ్బంది పనిచేయాలని సూచించారు.