చెరువు పూడికతీత పనులు వేగవంతం చేయాలి: మంత్రి

WGL: భద్రకాళి చెరువు పూడికతీత పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ భద్రకాళి చెరువు పూడిక తీత పనులను ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఇందుకు సంబంధించి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.