కూలీలతో వెళ్తున్న ట్రాలీ బోల్తా
KNR: జమ్మికుంట(M) తనుగుల గ్రామం సమీపంలో ఇవాళ ట్రాలీ బోల్తా పడింది. స్థానికులు వివరాల ప్రకారం.. వీణవంక మండలం ఎలుబాక నుంచి నాగారంకు పత్తి ఏరడానికి వెళ్తున్న కూలీలను తీసుకువెళ్తున్న ట్రాలీ ప్రమాదవశాత్తు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగ్రాతులను అంబులెన్స్‌లో జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.