గజగజ వణుకుతున్న ములుగు ఏజెన్సీ ప్రజలు..!
MLG: ఏజెన్సీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చలితో పాటు గాలులు విస్తుండడంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం మంచు, ఎముకలు కొరికే చలితో హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు వణుకుతున్నారు. చలి తట్టుకోలేక చలి మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.