'లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం'

AKP: పరవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి మీద లెక్చరర్ చేసిన లైంగిక దాడిని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విజయ్, జిల్లా అధ్యక్షుడు బాలాజీ తీవ్రంగా ఖండించారు. మహిళా చట్టాలను ప్రభుత్వం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లే ఇటువంటి లైంగిక దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ సంఘటనకు కారణమైన లెక్చరర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.