ఆకివీడులో ప్రోటోకాల్ వివాదం ఛైర్‌పర్సన్ అలక
W.G: ఆకివీడులో 13వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ఛైర్‌పర్సన్ జామి హైమావతిని ఆహ్వానించకుండానే కొబ్బరికాయ కొట్టించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు కావాలనే ఇలా చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంధం ఉమాపై ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కౌన్సిలర్ల విషయంలో వైసీపీ నాయకులకు ప్రోటోకాల్ గుర్తు రాలేదా అని ప్రశ్నించరూ.