నేడు BRS లీగల్ సెల్ కీలక సమావేశం

నేడు BRS లీగల్ సెల్ కీలక సమావేశం

TG: హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈరోజు  బీఆర్‌ఎస్ లీగల్ సెల్ సమావేశం కానుంది. ఈ సమావేశం ప్రధానంగా జిల్లాల్లో లీగల్ విభాగం ఏర్పాటుపై దృష్టి సారించనుంది. పార్టీ కార్యకర్తలపై నమోదైన తప్పుడు కేసులను ఎదుర్కోవడానికి ఈ లీగల్ సెల్ ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్ సహా పార్టీ ముఖ్యనేతలు హాజరుకానున్నారు.