ఈ నెల 8న గురుకులలో ప్రవేశ పరీక్ష

ఈ నెల 8న గురుకులలో ప్రవేశ పరీక్ష

కృష్ణా జిల్లాల్లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 8న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయ అధికారి అంగడి మురళీకృష్ణ తెలిపారు. జిల్లాలోని 13 పాఠశాలల్లో ఈ పరీక్ష జరుగుతుందని చెప్పారు. విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు ఉంటాయని చెప్పారు.