సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ

VZM: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రొచ్చని ఎస్సై బీ.గణేష్ తెలిపారు. నెల్లిమర్ల మండలం కొండగుంపాంలోని ఆలయాల వద్ద మంగళవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎస్సై మాట్లాడుతూ ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మండలంలో మతపరమైన పవిత్ర స్థలాల పరిరక్షణలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామంలో మూడు దేవాలయాల వద్ద ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.