గ్యాస్ సిలిండర్ల నిల్వలపై నాదెండ్ల సమీక్ష
AP: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు, సరఫరాపై మంత్రి మనోహర్ సమీక్ష నిర్వహించారు. 'రాష్ట్రంలో ఇప్పటివరకు ఎలాంటి గ్యాస్ కొరత లేదు. గృహ, వాణిజ్య అవసరాలకు సరిపడా సిలిండర్ల నిల్వలున్నాయి. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా పర్యవేక్షణ జరుగుతోంది. గ్యాస్ బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా బృందాలు ఏర్పాటు చేశాం' అని పేర్కొన్నారు.