VIDEO: జిల్లాలో దంచికొట్టిన వర్షం
ప్రకాశం: అకాల వర్షంతో జిల్లా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది . పొదిలి మండలం పరిసర గ్రామాల్లో భారీ గాలులు వీచాయి. కొన్ని చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయభ్రాంతులకు గరైయ్యారు.