జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు సీడీఎఫ్‌డీ కేంద్ర సందర్శన
BHNG: రాజాపేట ZPHS పదో తరగతి విద్యార్థులు బుధవారం ఎడ్యుకేషనల్ టూర్‌లో పాల్గొన్నారు. ఈ మెరకు రాజాపేటకు చెందిన CDFD సీనియర్ సైంటిస్ట్ ఎలగందుల నరేశ్ ఆధ్వర్యంలో HYDలోని సెంట్రల్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నేరా నిరూపణలో ఫింగర్ ప్రింట్స్, డీఎన్ఏ ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.