పొనుగోడులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం

పొనుగోడులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి కళ్యాణం

NLG: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం పొనుగోడు జక్కన్న గుట్టపై కొలువుదీరిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ చైర్మన్ డాక్టర్ కొంక నాగభూషణం తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి, తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు.