VIDEO: కోనప్ప ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంబలి పంపిణీ

VIDEO: కోనప్ప ఆధ్వర్యంలో కొనసాగుతున్న అంబలి పంపిణీ

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని వారసంత సమీపంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం సోమవారం 17వ రోజుకు చేరుకుంది. ప్రజలు, వాహనదారులు, పాదాచారులకు కోనప్ప కార్యకర్తలు అంబలి పంపిణీ చేశారు. వేసవి దృష్ట్యా తమ దాహార్తి తీర్చేందుకు అంబలి పంపిణీ చేస్తున్న కొనప్ప సేవలను ప్రజలు అభినందించారు.