సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు
CTR: పుంగనూరు పట్టణంలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం ఉదయాత్పూర్వమే అర్చకులు శ్రీవారిని మేల్కొల్పి ప్రత్యేకంగా అలంకరించి, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తర్వాత ఉత్సవ మూర్తిని అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.