VIDEO: ఖమ్మంలో కొట్టుకుపోయిన లారీ
KMM: ఖమ్మం జిల్లా, కొణిజర్ల మండలం, పల్లిపాడు - ఏన్కూరు మార్గంలో ఉన్న జన్నారం వాగులో బుధవారం ఒక లారీ కొట్టుకుపోయింది. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలని జిల్లా పోలీసులు తెలిపారు.