VIDEO: 'ఇంకా ఎన్నాళ్లు ఈ కల్వర్టు కష్టాలు'

KNR: గన్నేరువరం మండలంలో ఉన్న పారువెల్ల గ్రామ ప్రజలు “ఇంకా ఎన్నాళ్లు ఈ కల్వర్టు కష్టాలు?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో, పారువెల్ల నుంచి గన్నేరువరం వెళ్ళే రహదారిలోని లో లెవల్ కల్వర్టుపై వరదనీరు ప్రవహించి రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు నిండి మత్తడి దూకడంతో హై లెవల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు