VIDEO: అశేష జనవాహిని నడుమ గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం

VIDEO: అశేష జనవాహిని నడుమ గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం

KRNL: పెద్దకడబూరు మండలం తారాపురంలో వెలసిన శ్రీ గిడ్డాంజనేయ స్వామి రథోత్సవం శుక్రవారం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఈవో సాయి కుమార్ తేజ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారిని రథంపై ప్రతిష్ఠించి అశేష జనవాహిని నడుమ రథాన్ని లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు చుట్టూ గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.