VIDEO: 'గండికి మరమ్మతులు చేపట్టండి'
W.G: నూజివీడు పట్టణం నుంచి బోర్వంచ వెళ్లే ప్రధాన రహదారి వెంట గతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో పెద్ద గండి పడింది. నేటికీ ఆ గండిని పూడ్చక పోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎన్నోసార్లు మీకోసం, అధికారులకు విన్నవించిన ఎవరు స్పందించటం లేదని స్థానికులు వాపోయారు. గండి మరమ్మతులు నిర్వహించకపోతే రోడ్డు మరింతగా కోతకు గురి అవుతుందన్నారు.