VIDEO: శ్రీ మఠంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నడాఫ్ శుక్రవారం వచ్చారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. గ్రామదేవత మంచాలమ్మ దేవికి విశేష కుంకుమార్చన నిర్వహించి, మంగళహారతులు ఇచ్చారు. మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. శ్రీ మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామీజీ శాలువాలతో సత్కరించారు.