విద్యార్థులకు బహుమతులు ప్రదానం
NLR: ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులను జిల్లా ఆర్ఐఓ అభినందించారు. గురువారం కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాదరావు ప్రతిభావంతులైన విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధికి చదువు అత్యంత కీలకమని, ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరాలని ఆర్ఐఓ ఆకాంక్షించారు. విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.