మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

మాజీ ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

GNTR: పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుని మంగళవారం గుంటూరులోని ఉన్న తన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ తలపెట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసులు నోటీసులు అందజేశారు. రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయడానికి వెళ్తుంటే ఇలా హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని శంకరరావు మండిపడ్డారు.