వ్యక్తిపై దాడి.. కేసు నమోదు

KDP: ముద్దనూరు (M) కోసినేపల్లెలో నరసింహ నాయుడుపై మంగళవారం అదే గ్రామానికి చెందిన ప్రసాద్ దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ASI అరుణాచలం వివరాల ప్రకారం.. నరసింహ నాయుడు సెల్ ఫోన్‌లో ఎవరినో దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఇది గమనించిన ప్రసాద్ తననే తిడుతున్నాడని అగ్రహించి కట్టెతో నరసింహ నాయుడి తలపై దాడిచేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.