గోపాలపురంలో 'Saaksham-2026' అవగాహన సదస్సు
E.G: గోపాలపురం ఉన్నత పాఠశాలలో శనివారం 'Saaksham-2026' ఇంధన పొదుపు అవగాహన సదస్సు నిర్వహించారు. హెచ్‌పీసీఎల్ అధికారి గణేష్ పాల్గొని, భవిష్యత్తులో ఇంధన కొరత ఏర్పడకుండా పెట్రోల్, గ్యాస్ ఉత్పత్తులను పొదుపుగా వాడాలని సూచించారు. గృహాల్లో ఎల్పీజీ సిలిండర్ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.