నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు
HYD: అల్పపీడన ప్రభావంతో నగరంలో పలు చోట్ల రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలల్లో ఎడతెరిపిలేని వర్షం వల్ల రోడ్లపై నీరు చేరి వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు వాహనాదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.