భోగాపురంలో టెస్ట్ ఫ్లైట్ త్వరలోనే: కేంద్రమంత్రి
VZM: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులు మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లైట్ జరగనుందని చెప్పారు. సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును ఛాలెంజ్‌గా తీసుకుని కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారన్నారు.