'ప్రజా పథకాలకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకం'
KDP: ప్రజలకు ప్రభుత్వ పథకాలు సమర్థంగా చేరేందుకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కీలకమని డిప్యూటీ ఎంపీడీవో ఉమా మహేశ్వర్ పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఈ కొత్తపల్లిలోని స్వర్ణ కార్యాలయాన్ని సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి కుటుంబం సర్వే పరిధిలోకి రావాలని, ఒక్కరూ మిగలకుండా వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు.